Header Banner

అలా చచ్చిపోవాలని ఉంది! అదే చివరి సినిమా - అమీర్ ఖాన్!

  Sun Jun 01, 2025 19:04        Cinemas

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం భాషలతో పాటు దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న కథలు, విభిన్న పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం " సీతారే జమీన్ పర్ " అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి ఇప్పటికే పలు విషయాలను పంచుకున్నారు. అయితే ఈ క్రమంలోనే అదే తన చివరి సినిమా కావచ్చంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమీర్ ఏమన్నారంటే..

 

మహాభారతం అనేది తన చిన్నప్పటి కల అని చెప్పుకొచ్చారు. మహాభారతంలో ప్రపంచంలో ఉన్న అన్ని భావోద్వేగాలు ఉంటాయని.. అందుకే దాన్ని ఒక గొప్ప సినిమాగా చూపించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. అలాంటి గొప్ప సినిమా తన సినీ కెరియర్ లోనే ఆఖరి చిత్రం కావచ్చని కూడా అమీర్ ఖాన్ తెలియజేశారు. ఎందుకంటే అంతటి గొప్ప సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. అంతే కాకుండా అలాంటి గొప్ప సినిమా చేస్తూ చనిపోవాలని ఉందని అమీర్ ఖాన్ తెలిపారు. అమీర్ ఖాన్ మహాభారతం సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలు కూడా నటించబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా మహాభారతం సినిమా చేయటమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాలలో వెల్లడించారు. దీంతో వీరిద్దరిలో ఎవరు ముందుగా ఆ ప్రాజెక్ట్ చేస్తారో అని చర్చ నడుస్తోంది.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #AamirKhan #MahabharatMovie #SitaareZameenPar #AamirDreamProject #AamirKhanLastFilm #BollywoodNews #TollywoodStars #Rajamouli